Webdunia - Bharat's app for daily news and videos

Install App

06-03-2025 గురువారం దినఫలితాలు - కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

రామన్
గురువారం, 6 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణ నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కష్టం ఫలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలు ఎదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. యోగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత వహించండి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, అకాల భోజనం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి లొంగవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు విపరీతం. పనులు పురమాయించవద్దు. పరిచయం లేని వారితో వాదోపవాదాలకు దిగవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ వాక్కు ఫలిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు పట్టుదలతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా తీసుకోండి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతామీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments