Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-10-2024 మంగళవారం రాశి ఫలితాలు- ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు

Advertiesment
Astrology

రామన్

, మంగళవారం, 15 అక్టోబరు 2024 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. అనుమానిత వ్యక్తులతో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏకాగ్రత ప్రధానం.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అయిన వారితో సంభాషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది.. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం చేయవలసివస్తుంది. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయులను కలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆచితూచి అడుగేయాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనలు ఒక పట్టాన సాగవు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నోటీసులు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. వ్రాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధైర్యంగా యత్నాలు సాగించండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రుణ విముక్తులవుతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాలు అందుతాయి. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ప్రియతములతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదుగ చెట్టును ఇంట్లో నాటవచ్చా...?