Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-08-2023 బుధవారం రాశిఫలాలు - గాయత్రి మాతను ఆరాధించిన శుభం...

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవటం మంచిదికాదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులు బహుమతులు అందుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం :- మీ బంధవులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. డబ్బు పోయినా కొన్నిసమస్యల నుంచి బయటపడతారు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు. 
 
కర్కాటకం :- కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. మితిమీరిన శ్రమ, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీ ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలు చికాకు పరుస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఎదురైన ఒడిదుడుకులను అధికమిస్తారు.
 
సింహం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశీ ప్రయాణాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్వీజ్, పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. రాజకీయనాయకులు వేడుకలలో పాల్గొంటారు.
 
కన్య :- మీ ధ్యేయం నెరవేరాలంటే ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. వస్త్ర వ్యాపారులు పని వారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
తుల :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పురస్కారాలు వంటివి పొందుతారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. మీ ఆర్థికస్థితిని చూసి ఇతరులు అపోహపడే ఆస్కారం ఉంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి.
 
వృశ్చికం :- వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. విదేశీయాన యత్నాలలో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. విద్యార్థులు ప్రముఖుల నుండి బహుమతులు అందుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
ధనస్సు :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది. మీ మాటలు ఇతరుల తప్పుగా అర్ధం చేసుకునే ఆస్కారం ఉంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు.
 
మకరం :- చిట్స్, ఫైనాన్స్, రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. విందులలో పరిమితి పాటించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
కుంభం :- శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటంది. సాహస ప్రయత్నాలలో జయం చేకూరుతుంది. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. స్త్రీలు దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది.
 
మీనం :- మీ సంతానం కోసం ధనం బాగుగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఒక వ్యవహార నిమిత్తం తరచూ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments