Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-12-2023 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించిన శుభం...

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| చవితి ఉ.10.11 మఘ పూర్తి సా.వ6.02ల7.48. సాదు. 3.51 ల 4.35.
ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు చేర్పులకు అనుకూలం. దుబారా ఖర్చులు అధికమవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో తరచూ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మిథునం :- ఆర్థిక, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. మీ ఏమరపాటు తనం వల్ల పత్రాలు విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బయటపడతారు. స్త్రీలు షాపింగ్ కోసం ధనం ఖర్చుచేస్తారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్లఏకాగ్రత వహిస్తారు. మీ శక్తి సామర్ధ్యలపై నమ్మకం ఉంచి శ్రమించండి.
 
సింహం :- విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. ప్రింటింగ్ పనివారలకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకు పోవటం క్షేమదాయకం.
 
కన్య :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
తుల :- తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. బేకరీ, స్వీట్లు, పూల, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం :- ప్రైవేటు ఫైనాన్సులో మదుపు చేయటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం మంచిది.
 
ధనస్సు :- చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికలపై కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మకరం :- కొత్త వ్యక్తులను దరి చేరనీయకండి. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారమార్గం గోచరిస్తుంది. స్త్రీలకు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గతవిషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.
 
కుంభం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు విసుగుకలిగిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు.
 
మీనం :- వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత అవసరం. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కలవారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

అన్నీ చూడండి

లేటెస్ట్

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తర్వాతి కథనం
Show comments