ముక్కునుండి రక్తం కారుతుందా..?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:42 IST)
కొందరికి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే చాలు.. వెంటనే రక్తం వచ్చేస్తుంది. ఈ సమస్యకు గురైన వారు ఏం చేయాలో తెలియక తికమకపడుతుంటారు. అందుకు ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే.. మంచి ఫలితాలు లభిస్తాయి చెప్తున్నారు. మరి అవేంటో చూద్దాం...
 
1. పెద్ద ఉసిరికాయను బాగా దంచి, గింజలను తీసేసి ఆ మిశ్రమాన్ని నేతిలో వేయించి.. కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు మందంగా పట్టువేసి ఆరనివ్వాలి. ఇలా చేయడం వలన ముక్కు నుండి రక్తస్రావం ఆగిపోతుంది. 
 
2. మోదుగ చెట్టు పైబెరడును బాగా మెత్తగా నూరి అందులో పంచదారను కలిపి తింటే.. శరీరంలోని ఏ అవయవాన్నించి రక్తం కారుతున్నా అరికడుతుంది. 
 
3. ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష.. ఈ రెండింటిని మెత్తగా నూరి తగినంత తేనె కలిపి ఓ సీసాలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో చెంచా చొప్పున తీసుకుంటే అన్ని రకాల రక్తస్రావాలు అరికడుతాయి. 
 
4. అడ్డసరం చెట్టు ఆకులు, వేళ్ళు, పువ్వులు.. వీటిని రసంగా తీసి పెట్టుకోవాలి. నోట్లో నుంచి, ముక్కులో నుంచి రక్తస్రావం అవుతుంటే.. ఈ రసాన్ని తీసుకుంటే.. అరికడుతుంది. 
 
5. క్షయ, ఊపిరతిత్తుల వ్యాధితో బాధపడేవారు అడ్డసరం ఆకుల రసంలో నెయ్యి కలిపి బాగా వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమాం చల్లారిన తరువాత రోజుకు రెండు పూటలా చెంచా చొప్పున తీసుకుంటే ముక్కులో నుండి, నోట్లో నుండి వచ్చే రక్తస్రావాలు నివారిస్తుంది.
 
6. బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయను తీసుకుని దానితో హల్వా చేసుకుని తీసుకుంటే రక్తస్రావాలు అరికడతాయి. 
 
7. బూడిద పట్టని లేత బూడిద గుమ్మడికాయని సొరకాయ వండినట్లు వండుకుని రోజు తింటే కూడా రక్తస్రావాన్ని అరికడుతుంది. దాంతో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

సవతి కొడుకుతో అక్రమ సంబంధం.. వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ..?

ప్రధాని మోడీ గురించి తప్పుగా మాట్లాడితే దేశ ప్రజలు సహించరు, ఇదిగో నిదర్శనం వీడియో

కేతన్ లోయలో పడిపోయాడని చెప్పింది.. కానీ కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

NEET పేపర్ లీక్, అట్లాంటి పేరెంట్స్ వల్లనే, అది తప్పుడు పెంపకం: యాంకర్ రష్మి గౌతమ్

తర్వాతి కథనం
Show comments