Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతునొప్పిని తగ్గించాలంటే.. ఏం చేయాలో తెలుసా..?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (18:47 IST)
శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పి వస్తుంది. దీంతో వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని పాటి ఆహార నియమాలు పాటించాలని చెప్తున్నారు.
 
స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వలన గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. తద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి వస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మిరియాలను సూప్స్‌, టీ లో అల్లం చేర్చి తాగడం వల్ల గొంతునొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా గొంతునొప్పి ఉండే సమయంలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 
 
మిరియాల సూప్స్ గొంతు నొప్పిని చాలా సులభంగా తగ్గిస్తాయి. ఎక్కువగా గొంతు నొప్పితో బాధపడుతుంటే కనుక గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే గొంతునొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోతాయి. గొంతునొప్పి మరీ ఎక్కువగా ఉంటే తేనె, నిమ్మరసం గోరువేచ్చని నీటిలో కలిపి తాగితే మంచి  ఫలితాన్నిస్తుంది.
 
గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిళించాలి. ఇలా చేస్తే గొంతునొప్పి మటుమాయం. మనం సాధారణంగా ఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువులు గొంతు నొప్పిని కూడా నివారిస్తాయి. ఉదాహరణకు అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments