Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 3 చిట్కాలతో మోచేతుల అందం.. ఎలా..?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:16 IST)
కొందరికైతే మోచేతులు నల్లగా, బరకగా మారి ఉంటాయి. వీటి కారణంగా కురచ చేతులున్న దుస్తులు వేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారు పడుకునే ముందు మోచేతులను గోరువెచ్చని నీళ్లతో కడిగి ఫ్యూమిక్‌రాయితో రుద్దుకోవాలి. ఆ తరువాత కొబ్బరినూనె లేదా ఆలివ్‌నూనెతో ఆ ప్రాంతాన్ని మర్దన చేయాలి. నిత్యం ఇలా చేయడం వలన చర్మం మెత్తబడుతుంది. 
 
1. రెండు చెంచాల కొబ్బరి నూనెకు అరచెంచా నిమ్మరసం జతచేసి మోచేతులకు రాసుకుని పావుగంటపాటు మర్దన చేయాలి. వీలుంటే ఇలా రోజులో రెండుమూడు సార్లు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మోచేతుల నలుపు తగ్గిపోతుంది. దాంతో మోచేతులు చూసేందుకు మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
 
2. నిమ్మకాయ ముక్కకు పంచదారను అద్ది మోచేతులు, మోకాళ్ల మీద 10 నిమిషాల పాటు రుద్దాలి. ఇలా రెండు రోజుల కోసారి చేస్తే మోచేతులు మృదువవుతాయి. చెంచా పెరుగుకు చిటికెడు బాదం పొడి కలిపి మోచేతులకు మాస్క్‌లా వేసుకోవాలి. ఈ మాస్క్‌ తేమ ఆరిన తరువాత చల్లటి నీళ్లతో శుభ్రపరచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే మోచేతులు తాజాగా మారుతాయి. 
 
3. 2 స్పూన్ల పసుపులో కొద్దిగా నీరు కలిపి మోచేతులకు రాసుకోవాలి. ఓ 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి చేసిన మోచేతులపై గల మచ్చలు, పులిపిరులు పోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్యార్థులపై లాఠీ ప్రయోగం : సభలో అమిత్ షా మాట్లాడుతారు : కేంద్రం

హయత్‌నగర్‌: పార్కింగ్ చేసిన కారులో మంటలు.. ఎలా జరిగింది?

పంటపొలంలో రూ.5లక్షలను పాలిథిన్ సంచిలో వుంచి పాతిపెట్టిన రైతు... చివరికి? (Video)

శ్రీ చైతన్య హైస్కూల్ హాస్టల్‌లో ర్యాంగింగ్.. కర్రలు, ప్లేట్లు, బూట్లతో విద్యార్థిపై దాడి

Chennai: పోర్షే కారును ఢీకొన్న క్యాబ్- ఏఆర్ రెహ్మాన్ కుమారుడికి స్వల్ప గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: ఇన్ కమ్ డాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా టబు

Allu Arjun : విశాఖపట్నంలో సరికొత్త ఐకానిక్ AAA Cinemasbను ప్రారంభించిన అల్లు అర్జున్

Kiran Abbavaram : బాలీవుడ్ నిర్మాతలతో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం ఇంద్రపుత్ర

Ajay Bhupathi: ఆ సినిమాతో కిందపడ్డా మళ్ళీ నచ్చే సినిమాతో పైకి లేస్తా : అజయ్ భూపతి

Hansika: అతీంద్రియ పోలీస్ మిస్టరీ గా కపాలి నుంచి హన్సిక మోత్వాని లుక్

తర్వాతి కథనం
Show comments