గోరింటాకు పొడి, కలబంద గుజ్జుతో.. నల్లటి వలయాలు..?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (11:11 IST)
ముఖం అందంగా కనిపించాలని ఏవేవో క్రీములు వాడి ముఖాన్ని పాడుచేస్తుంటారు. ఇలాంటి క్రీములు వాడకుండానే అందంగా మారొచ్చని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం... ఇంట్లో దొరికే పదార్థాలతో ముఖం అందం మరింత పెరుగుతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
 
1. కరివేపాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అందానికి ఎలా.. కరివేపాకు పొడిలో కొద్దిగా వంటసోడా, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోతాయి.
 
2. శీకకాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముడతల చర్మం తొలగిపోతుంది. 
 
3. గోరింటాకు పొడిలో కొద్దిగా కలబంద గుజ్జు, కీరదోస రసం, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
4. క్యారెట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటితో జ్యూస్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం, చక్కెర కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
5. ఉల్లిపాయ మిశ్రమంలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడుతలు చర్మం రాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తారింటికి వెళ్లిన కూతురు ఆర్జించే డబ్బులో సగం పుట్టింటికా? ఇదేదో ఆలోచించాల్సిందే, వీడియో

Rowdy Sheeter: రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య

గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ప్రారంభం

సింగపూర్‌లో వజ్రం చోరీ కేసు : భారతీయుడికి రెండేళ్ల జైలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్య బాబాయ్ త్వరగా కోలుకోవాలి : నందమూరి బ్రదర్స్

షూటింగులో గాయపడిన నందమూరి బాలకృష్ణ

Balakrishna injured : కాకినాడలో నందమూరి బాలకృష్ణ కు గాయాలు 15రోజుల విశ్రాంతి

Yash: యష్, తారా సుతారియా లమధ్య విరహంతో కూడిన కెమిస్ట్రీ హైలైట్ గా సాంగ్

Karti: కార్తి... సర్దార్ 2' నుంచి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్.. సినిమా సెప్టెంబర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments