Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదాలు నల్లగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (11:14 IST)
కొంతమంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు. కానీ, వారి పెదాల కారణంగా ఆ అందాన్ని కోల్పోతున్నారు. పెదాల నల్లగా మారగడం, పొడిబారడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడాలని ఏవేవో క్రీములు, మందులు వాడుతుంటారు. వీటి వాడడం సమస్యను రెట్టింపు చేస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక ఆందోళనతో చింతిస్తుంటారు.. అందుకు.. ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగిస్తే పెదాలు అందంగా, చూడడానికి ముచ్చటగా కనిపిస్తాయి.. మరి ఆ పదార్థాలేంటో చూద్దాం..
 
బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టితే వచ్చే రసంలో స్పూన్ తేనె కొద్దిగా చక్కెర వేసి పేస్ట్‌లా చేసి పెదాలకు పూతలా వేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే నల్లగా ఉన్న పెదాలు ఎరుపుగా తయారవుతాయి. ఇలా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
 
ఓ గిన్నెలో 2 స్పూన్ల కొబ్బరినూనె వేసి తరువాత స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు కలిపి పెదాలకు ప్యాక్ వేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే.. పెదాలు మృదువుగా, అందంగా మారుతాయి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే.. కొన్ని రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. 
 
కొబ్బరి నూనెలో కొద్దిగా పెరుగు, గులాబీ నీరు కలిపి పేస్ట్ చేసి పెదాలకు అప్లై చేయాలి. రెండు గంటల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే పెదాలు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. ఈ లిప్‌స్క్రబ్‌ను ఓ బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచి వారం రోజుల వరకు ఉపయోగించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

తర్వాతి కథనం
Show comments