గుడ్డుసొనతో పెరుగు కలిపి.. ఫేస్‌ప్యాక్..?

గుడ్డుసొనలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెడభాగం తెల్లగా,

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:50 IST)
గుడ్డుసొనలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెడభాగం తెల్లగా, మృదువుగా మారుతుంది. కీరదోస రసంలో నిమ్మరసం, పసుపు, గ్లిజరిన్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. సూర్యకాంతి విత్తనాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
శెనగపిండిలో పసుపు, రోజ్ వాటర్, నిమ్మరసం, కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో టమోటా రసం, ఓట్స్ మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heat Dome, ఉడికిపోతున్న ఫ్రాన్స్, ఏసీల కోసం ఎగబడుతున్న జనం, వీడియో

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్ నిర్మాత

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

నేనే గోల్డ్‌మేన్ అంటూ ఎగిరిపడ్డ సూర్య అరెస్ట్, ఎందుకంటే?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Aishwarya Rajesh :ఇసకపట్నం పై ఆధిపత్యం చేసే సముద్రఖని కి సవాల్ గా మారిన ఐశ్వర్య రాజేష్

Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తత్వం ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments