పుదీనా పేస్టే ఫేస్‌ ప్యాక్..?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:32 IST)
పుదీనా ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పుదీనా అందానికి కూడా అంతే ఉపయోగపడుతుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఈ చలికాంలో ఏర్పడే చర్మ సమస్యల కారణంగా ముఖం పొడిబారడం, మెుటిమలు రావడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా.. ముఖం ముడతలుగా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి.. అవేంటో చూద్దాం...
 
1. పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికా అప్లై చేయాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా, తెల్లగా మారుతుంది. పుదీనాలో ఉండే శాలిసైలిక్ అనే ఆమ్లం ముఖంపై మెుటిమలు రాకుండా కాపాడుతుంది.  
 
2. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసే ముందుగా ముఖచర్మాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
3. పుదీనా రసంలో బొప్పాయి రసం కలిపి చర్మ దురదలుగా ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సహాయపడుతుంది.
 
4. పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ నూనెను వాడితే జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుండి బయటపడేస్తుంది. మాడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బుల్లెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ : 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై

Nara Brahmani: నారా బ్రాహ్మణీకి అరుదైన అవార్డు.. నారా లోకేష్ కితాబు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్ అరెస్టు

ముంబై ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఆపరేషన్

ఆ ఒక్కరోడ్డు నాణ్యతలోపంతో పవన్ కల్యాణ్ శాఖకి ఫస్ట్ ర్యాంక్ జస్ట్ మిస్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాయితం విడుదల తేదీ ఫిక్స్

Aishwarya: రహస్యాన్ని దాచి తిరు వీర్, ఐశ్వర్య ను పెళ్లి చేసుకుంటే ఏమయింది?

Nagarjuna: తిరుమల వేంకటేశ్వరుడే అఖిల్ కు సక్సెస్ ఇచ్చాడు : అక్కినేని నాగార్జున

అఖిల్ అక్కినేని 'లెనిల్' తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?

లెనిన్ అదుర్స్.. పండగ చేసుకుంటున్న జైనాబ్.. తొలి రోజు 16.7కోట్ల కలెక్షన్ (video)

తర్వాతి కథనం
Show comments