తలలో చుండ్రు పోవాలంటే తమలపాకులను మెత్తగా రుబ్బి?

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (16:04 IST)
పెళ్ళిళ్లలో, శుభకార్యాలలో ప్రధానంగా ఉపయోగించే తమలపాకు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తలనొప్పితో బాధపడేవారు లేత తమలపాకును నుదుటిపై పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఎముకలు పటిష్టంగా ఉండటానికి అవసరమైన కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో సమృద్ధిగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకుకు ఉంటుంది. 
 
వృద్ధాప్య చాయలు కనిపించకుండా ఉండాలంటే తరచుగా తమలపాకులు తినండి. వీటిలో ఎసెన్షియల్ ఆయిల్ అధికంగా ఉంటుంది. అది ఫంగస్ రాకుండా చూసుకుంటుంది. బోధకాలుతో బాధపడేవారు తమలపాకులో కొద్దిగా ఉప్పు వేసి దంచి నీటిలో కలుపుకుని సేవిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. 
 
రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అది తిన్న వెంటనే చల్లని నీరు తాగాలి. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు తమలపాకు రసాన్ని తీసి కొద్దిగా ముక్కులో వేసుకుంటే సమస్య వెంటనే తగ్గుతుంది. తలలో చుండ్రు పోవాలంటే తమలపాకులను మెత్తగా రుబ్బి దానిని తలకు పట్టించండి. కాసేపటి తర్వాత తలస్నానం చేయండి. 
 
అలా తరచుగా చేస్తుంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. అయితే సంతానం కోసం చూసేవారు తమలపాకు తొడిమను అస్సలు తినకండి, గర్భందాల్చలేకపోవచ్చు. మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే తరచూ తమలపాకుల రసాన్ని తాగుతూ ఉండండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

COVID-19: 13 ఏళ్ల బాలికకు విజయవాడలో కోవిడ్

కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి కేజీ బంగారం మాయం చేశారు.. ఎక్కడ?

Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...

ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు బాలికలు అదృశ్యం.. ఏమయ్యారు?

గిరిజన గ్రామాల్లో రూ.1 కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

Ambika Krishna :సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ .ఎందుకని?

తర్వాతి కథనం
Show comments