Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
చాలా మందిని చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో నిలబడాలంటే వారు చిన్నతనంగా భావిస్తుంటారు. ఇలాంటి ఇంటి వద్దనే చిన్నపాటి చిట్కాలతో సమస్య నుంచి గట్టెక్కవచ్చు. వెనిగర్‌ని, నీటిని సమపాళ్ళలో తీసుకుని మీ జుట్టుకి పట్టించి తల స్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.
అలాగే, పుల్లటి పెరుగుని తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి మంచి ఫలితం లభిస్తుంది, అంతేకాక జుట్టు మెరుస్తుంది. 2 స్పూన్లు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వాటిని పిండిగా చేసి మీ తలకు పట్టించుకుని 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ నానబెట్టిన నీటిని పారవేయకుండా, స్నానం తర్వాత మీ జుట్టుని ఈ నీటితో శుభ్రం చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది. అంతేగాక జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఆలివ్ ఆయిల్ మీ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రునీ తొలగించుటలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని మీ జుట్టుకి పట్టించి మసాజ్ చేయాలి, తర్వాత మీ జుట్టుని ఒక టవల్‌తో చుట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలాక్రమం తప్పకుండా చేయడం ద్వారా చుండ్రు సమస్య నుండి శాశ్వతంగా తగ్గుతుంది.