మీగడ, తేనెతో ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (11:57 IST)
చిన్న వయస్సులోనే చాలామందికి ముఖం ముడతలుగా మారుతుంది. ఎందుకంటే.. ఎక్కువగా మేకప్ వేసుకుంటే కూడా చర్మం ముడతలుగా మారుతుంది. సాధారణంగా కొందరైతే మేకప్ వేసుకుంటే అందంగా కనిపిస్తారని ఎక్కడికి వెళ్లినా మేకప్ వేసుకునే వెళ్తారు. కానీ, ఇప్పుడు ఆ మేకప్ అందాన్ని కోల్పోలా చేసింది.. మరే ఏం చేయాలంటూ.. సతమతమవుతుంటారు. చర్మం అందంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని బ్యూటీషన్స్ చెప్తున్నారు. అవేంటే చూద్దాం..
 
మీగడలలో కొద్దిగా తేనె, చక్కెర కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తే.. ముడతల చర్మం తొలగిపోయి ముఖం మృదువుగా మారుతుంది. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని తాజాగా మార్చుతుంది. ఎలా అంటే.. నిమ్మ తొక్కలను పొడిచేసి అందులో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి, మెడదు రాసుకోవాలి. 
 
గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. అలానే కాఫీ పొడిలో కొద్దిగా గోరింటాకు పొడి, వంటసోడా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. దాంతో పాటు మెుటిమలు కూడా తొలగిపోతాయి. 
 
ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. ఆలివ్ నూనెలో కొద్దిగా మెంతి పొడి, క్యారెట్ రసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు చర్మం పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమికుడిని కలవనివ్వలేదు.. మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Saudi: మా రాజ్యం ఎటువంటి ఒత్తిడికీ తలొగ్గదు.. సౌదీ వార్నింగ్

ఇరాన్ క్షిపణి దాడులు.. అబుదాబి గ్యాస్ కేంద్రాల మూసివేత.. యూఏఈ ఫైర్

పాకిస్తాన్ కూడా అమెరికాకు ముప్పుగా మారుతుంది: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్

Vijay: 50శాతం సీట్లు, 2.5ఏళ్ల సీఎం పోస్టు: నో చెప్పిన విజయ్.. త్రిషతో చర్చలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

తర్వాతి కథనం
Show comments