Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండుపూటలా స్నానం చేస్తే సరిపోదు... మరింకేం చేయాలి?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (21:02 IST)
ప్రతిరోజు రెండు పూటలా స్నానం, ముఖానికి సబ్బు, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఓ మాయిశ్చరైజర్... ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలనుకుంటారు చాలామంది మహిళలు. అయితే వీటితో పాటు చర్మ సంరక్షణలో భాగంగా ముఖ్యమైనది మృత కణాలను తొలగించుకోవడం. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నిర్జీవంగా మారి కళ తప్పి పొడిబారినట్లవుతుంది. మరి వీటిని సహజమైన పదార్దాలను ఉపయోగించి ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. వేపాకుల్ని ముద్దలాగా చేసి కాస్త పెసరపిండి , చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి.  ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం నునుపుగా తయారవుతుంది.
 
2. ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనె బాగా కలిపి ఇందులో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి మిగతా శరీరానికి రాసి కొన్ని నిముషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. పది నిముషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.
 
3. కొబ్బరినూనె  చర్మానికి కావలసిన తేమను, పోషణను అందిస్తుంది.
 
4. ఒక టీ స్పూన్ టమోటా రసంలో కొద్దిగా గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ బ్రూ పొడిని కలిపి ఫేస్టులా చేసి దానిని ముఖానికి పట్టించాలి. 15 నిమిషముల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేయడం వలన ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనిపిస్తారు. 
 
5. అరటిపండు ఆరోగ్యానికే కాకుండా మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో మాయిశ్చర్ అధికం. అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఇ ఎక్కువుగా ఉంటాయి. అరటిపండుగుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. దీని వలన ముఖంపై ఉన్న నల్లమచ్చలు తొలగి చర్మం సున్నితంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

తర్వాతి కథనం
Show comments