పసుపులో మీగడ కలిపి ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (12:11 IST)
అధిక ధరలు చెల్లించి ఫేస్‌ఫ్యాక్స్, స్క్రబ్బస్ వాడడం కంటే సహజసిద్ధంగా లభించే పసుపుని వాడడం మంచిదని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. పసుపు వాడకం వలన మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. పసుపుతో ప్యాక్, స్క్రబ్ ఇంట్లోనే తయారుచేసుకుని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ ప్యాక్ ఎలా చేయాలో.. ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం...
 
2 స్పూన్ల పసుపులో స్పూన్ బియ్యం పిండి, టమోటా రసం, పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ తరువాత ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై గల మొటిమలు, నల్లటి మచ్చలు పోయి ముఖం కాంతింతంగా, మృదువుగా తయారవుతుంది.
 
3 స్పూన్ల పసుపులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
 
ఒక బౌల్‌లో కొద్దిగా పసుపు వేసుకుని అందులో స్పూన్ మీగడ, శెనగపిండి కలిపి స్క్రబ్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాలపాటు ముఖాన్ని మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లానాజ్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి ... చమురు ఉత్పత్తి నిలిపివేత

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసు : నిందితులకు బెయిల్ రద్దు

ప్రపంచ కుబేరుల జాబితా - వరల్డ్ బిలియనీర్లలో మూడో స్థానంలో భారత్

బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి మూసివేత హౌతీ రెబెల్స్ దృష్టి

పెళ్లి రోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. ఇద్దరు పిల్లల గొంతుల నులిమి.. ఆపై వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments