శీతాకాలంలో ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (12:49 IST)
ఈ చలికాలంలో ఎంత జాగ్రత్త ఉన్నా చలి కారణంగా చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యకు గురికాకుండా తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి పాడయిన చర్మాన్ని తిరిగి ఫేస్‌ప్యాక్‌తో రిపెయిర్ చేసుకోవాలి. ఇందుకోసం ఈ ప్యాక్స్ ట్రై చేయండి.. మంచి ఫలితాలు లభిస్తాయి.
 
తేనె, పెరుగు, పసుపు ప్యాక్:
తేనె చర్మానికి మంచి ఔషధం. ఇది ఒక రకమైన మాయిశ్చరైజర్. దీనితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. పావుకప్పు పెరుగులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. 
 
కలబంద, నిమ్మ ప్యాక్:
కలబంద బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి చర్మానికి హాని కలుగకుండా మెరుపురావడంలో కలబందకు మించిన ఔషధం లేదు. నిమ్మకు చర్మం మీది బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మక్రిముల్ని చంపే గుణం ఉంది. కాబట్టి ఈ రెండిటితో తయారైన ప్యాక్ వేసుకుంటే మంచిది. కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండు నుండి మూడుసార్లు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. 
 
గంధం, రోజ్‌వాటర్ ప్యాక్:
మెుటిమలు, ముడతలను పోగొట్టే గంధం చర్మానికి మెరుపును కూడా అందిస్తుంది. గంధానికి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంది. గంధంలో రోజ్‌వాటర్ కలపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శఉబ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తని బట్టతో తుడవాలి. ఈ ప్యాక్‌ను ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాతే వేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

COVID-19: 13 ఏళ్ల బాలికకు విజయవాడలో కోవిడ్

కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి కేజీ బంగారం మాయం చేశారు.. ఎక్కడ?

Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...

ఇద్దరు అక్కాచెల్లెళ్లతో సహా ముగ్గురు బాలికలు అదృశ్యం.. ఏమయ్యారు?

గిరిజన గ్రామాల్లో రూ.1 కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

Ambika Krishna :సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ .ఎందుకని?

తర్వాతి కథనం
Show comments