చలికాలంలో మెరిసే సౌందర్యం కోసం ఈ చిట్కాలు..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (18:16 IST)
4
చలికాలంలో మెరిసే సౌందర్యం కోసం ఈ చిట్కాలు పాటించాలని బ్యూటీషియన్లు అంటున్నారు. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. అలాంటి వారు ఆరెంజ్, తేనెను వినియోగించాలి. పొడిబారిన చర్మ సమస్య ఉన్నవారే కాకుండా, జిడ్డు చర్మం వున్నవారు కూడా ఈ రెండిటిని వాడినట్లైతే ఆకర్షణీయమైన చర్మం పొందగలుగుతారు. 
 
సహజంగా చలి వల్ల కలిగే ఈ రకమైన సమస్యను తగ్గించేందుకు ఎక్కువశాతం నీరు తాగుతారు. ఇదీ ఒక రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆరంజ్, తేనె వాడినట్లైతే ఈ సమస్యపైన ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో మొక్కజొన్న పిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు శరీరానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే శరీరం మిల మిలలాడుతుంది.
 
ఆరంజ్ పండ్లను తినేసి తొక్కలను బయట విసిరివేయకుండా, వాటిని ఎండలో ఎండబెట్టి పౌడర్‌గా చేసుకొని ఆ పౌడర్‌ని నీటిలో కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసినట్లైతే పొడిబారిన చర్మం ఇట్టే మాయమైపోతుంది.
 
అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి లేక రెండు టీ స్పూన్ తేనె కలిపి ఉదయానె పరగడుపుతో తాగినట్లైతే మేని మిలమిలలాడడమేకాకుండా, శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు. 
 
జిడ్డు చర్మం వున్నవారు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాసినట్లైతే చర్మం నిగ నిగలాడుతుంది. మచ్చలు, గాయాలు వంటి సమస్య ఉన్నవారు టమోటో గుజ్జుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని, సమస్య ఉన్నచోట రుద్ది ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే గాయాలు మాయమైపోతాయని బ్యూటీషియన్లు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోటిన్నర మొబైల్ నంబర్లు బ్లాక్.. అందులో మీ నంబర్ వుందా?

400 మీటర్ల దూరానికి రూ.18 వేలు వసూలు.. ఎక్కడ?

ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి : సీఎం చంద్రబాబు

మీ అక్కను చంపేస్తున్నా.. రికార్డు చేసిపెట్టుకో.. పోలీసులకు ఆధారంగా ఉంటుంది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రణబాలి, రౌడీ జనార్థన చిత్రాలతో అలరించనున్న విజయ్ దేవరకొండ

Rajamouli: మహేష్ బాబు.. వారణాసి చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి

Vishwak: భగవంతుడు లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టం : విశ్వక్ సేన్

మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల కానున్న సుమతి శతకం

Komali Prasad: సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ మండవెట్టి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కోమ‌లి ప్రసాద్

తర్వాతి కథనం
Show comments