Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 2118 బ్యాంకు శాఖల మూసివేత

Webdunia
మంగళవారం, 11 మే 2021 (15:55 IST)
కరోనా కష్టకాలంలో భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 2118 శాఖలను మూసివేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఈ విషయం వెల్లడైంది. 
 
2020-21 ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్యాంక్ బ్రాంచులు మూసివేసినట్లు తెలిపింది. ఈ బ్యాంకు బ్రాంచులు శాశ్వతంగా మూసివేసే అవకాశం ఉంది. లేదంటే ఇతర బ్యాంకు బ్రాంచ్‌లుగా మారిపోయే అవకాశం ఉంది.
 
అయితే బ్యాంకుల మూసివేత అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. బ్యాంకుల విలీనం కారణంగా ఈ స్థాయిలో బ్యాంక్ బ్రాంచులు క్లోజ్ కావడం గమనార్హమని చెప్పుకోవచ్చు. ఈ 2118 బ్రాంచుల్లో ఏ బ్యాంక్ శాఖలు ఎక్కువగా మూతపడ్డాయో తెలుసుకుందాం.
 
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1283 బ్రాంచులు ఉండగా, దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 332 శాఖలు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 169 శాఖలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 124 బ్రాంచ్‌లు, కెనరా బ్యాంక్ 107 శాఖలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 53 శాఖలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43 శాఖలు, ఇండియన్ బ్యాంక్ 5 శాఖలు చొప్పున ఉన్నాయి. 
 
కాగా, కేంద్ర సర్కార్‌ గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ పది బ్యాంకులు 4 బ్యాంకులుగా ఆవిర్భవించాయి. దీంతో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు దిగివచ్చింది. కాగా బ్యాంకుల విలీనం వల్ల బ్రాంచులు తగ్గడం బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని, ఉపాధి తగ్గుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments