Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ రిటైల్‌లో మరో మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడులు!!

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (15:22 IST)
దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో మరో మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీలో పలు కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విషయం తెల్సిందే. తాజాగా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ కంపెనీ మరో 3,675 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది. అంటే రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ పెట్టుబడులు రిటైల్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సహకరిస్తాయని తెలిపింది.
 
ఈ కొత్త పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ విలువ 4.28 లక్షల కోట్లకు పెరిగినట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సంస్థలోని 15 శాతం వాటాలను విక్రయించడం ద్వారా సుమారు రూ.63 వేల కోట్ల వరకూ నిధులను సమకూర్చుకోవాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పార్టనర్స్ 1.75 శాతం వాటాను, కేకేఆర్ అండ్ కో 1.28 శాతం వాటాలను కొనుగోలు చేయగా, 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చిందన్న విషయం తెలిసిందే.
 
ఇదిలావుండగా, తాజాగా రిటైల్ విభాగంలోనూ సంస్థ భాగం కావడం పట్ల అధినేత ముఖేష్ అంబానీ, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అట్లాంటిక్‌తో తమ సంబంధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జనరల్ అట్లాంటిక్ సంస్థ రిలయన్స్ జియోలో ఇప్పటికే రూ.6,598 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. 
 
డిజిటల్ ఇండియాకు తమ వంతు సహకారాన్ని అందించడంతో పాటు భారత్‌లో రిటైల్ రంగం సానుకూల మార్పుల దిశగా సాగుతున్న వేళ, తమవంతు పాత్ర కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పెట్టుబడులు పెట్టినట్టు జనరల్ అట్లాంటిక్ సీసీఓ బిల్ ఫోర్డ్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments