Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లు.. రాష్ట్రాలకు రూ.4 వేల కోట్లు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:47 IST)
ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో 1.13 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో వసూలైనట్టు తెలిపింది. దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటడం వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. 
 
గతేడాది ఫిబ్రవరి నాటి వసూళ్లతో పోల్చితే ఈసారి 7 శాతం అధికం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వివరించింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే ఈ ఫిబ్రవరిలో వస్తు దిగుమతులపై వసూళ్లు 15 శాతం అధికం అని, దేశీయ లావాదేవీలపై 5 శాతం ఎక్కువగా వసూళ్లు వచ్చాయని వెల్లడించింది.
 
కాగా, 2021లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లు వచ్చాయి. లాక్డౌన్ ఆంక్షలు ఉపసంహరించుకోవడంతో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు ఒక్కసారిగా ఉరకలెత్తాయి. 2017లో జీఎస్టీ విధానం తీసుకువచ్చాక జనవరి వసూళ్లే అత్యధికం. 
 
మరోవైపు, రాష్ట్రాలకు కేంద్రం 18వ విడత జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లు విడుదల చేసింది. 23 రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పరిహారం వర్తిస్తుంది. 2020 అక్టోబరు నుంచి విడుదల చేస్తున్న ఈ పరిహారం మొత్తం ఇప్పటివరకు రూ.1.04 లక్షల కోట్లకు చేరుకుంది. 
 
ఈ సందర్భంగా ఏపీకి అదనపు రుణ సౌకర్యం కింద రూ.5,051 కోట్లు మంజూరు చేసింది. స్పెషల్ విండో ద్వారా ఏపీకి రూ.2,306 కోట్లు కేటాయించింది. అటు, తెలంగాణకు అదనపు రుణ సౌకర్యం కింద 5,017 కోట్లు కేటాయించగా, స్పెషల్ విండో ద్వారా రూ.2,027 కోట్లు మంజూరు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments