మారుతి సుజుకీతో భారతదేశం ఎలక్ట్రిక్ విధానం వన్ ఇండియా, వన్ EV ప్లాట్‌ఫాం

ఐవీఆర్
గురువారం, 4 డిశెంబరు 2025 (20:10 IST)
13 ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్, అగ్రిగేటర్స్‌తో సహకార ఒప్పందాలపై సంతకాలు చేయడం గురించి మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఒప్పందాలు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ నుండి శ్రీ. హిసాషి టకేఉచి, మేనేజింగ్ డైరెక్టర్-సీఈఓ, మరియు శ్రీ. పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్-సేల్స్ మరియు CPOల నుండి ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో సంతకాలు చేయబడ్డాయి.
 
ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీ హిసాషి టకెఉచి, మేనేజింగ్ డైరెక్టర్-సీఈఒ, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, శాశ్వతమైన నమ్మకాన్ని రూపొందించడానికి మా కస్టమర్లకు ఆనందకరమైన యాజమాన్య అనుభవం అందించడానికి మారుతి సుజుకీలో మేము కృషి చేస్తున్నాము. EV ఛార్జింగ్ విచారాలు పరిష్కరించడానికి, కస్టమర్‌కు ఆత్మవిశ్వాసం పెంచడానికి పూర్తి సంసిద్ధతతో మేము ఎలక్ట్రిక్ ప్రయాణం విభాగంలోకి ప్రవేశించిన కారణంగా నేడు మేము ఒక చారిత్రకమైన చర్య తీసుకుంటున్నాము.
 
మా సేల్స్, సర్వీస్ నెట్ వర్క్ లో 2,000 మారుతి సుజుకీ ప్రత్యేకమైన ఛార్జింగ్ పాయింట్లు యొక్క దృఢమైన నెట్ వర్క్ ను మేము స్థాపించాము. ఇవి 1,100 పట్టణలు కంటే ఎక్కువగా విస్తరించాయి. దేశంలో విస్తృతమైన ఛార్జింగ్ మౌళిక సదుపాయాలు అందచేయడానికి 13 ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ తో కూడా మేము అనుసంధానం చెందాము. సుజుకీ యొక్క అంతర్జాతీయ కలతో, మేము బహుళ EVలు పరిచయం చేయడానికి ప్రణాళిక చేసాము, మరియు దీనిని మద్దతు చేయడానికి, 2030 నాటికి భారతదేశంవ్యాప్తంగా 1 లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లు యొక్క నెట్‌వర్క్‌ను ప్రారంభించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము.
 
దృఢమైన EV ఇకోసిస్టం చూపిస్తూ, శ్రీ. పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్ & సేల్స్, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్, ఇలా అన్నారు, భారతదేశంలో ఎలక్ట్రిక్‌గా ప్రయాణించడానికి ఒక కొత్త యుగం నేడు ప్రారంభమైంది. మీ చెంత  EV ఛార్జింగ్ మౌళిక సదుపాయం గురించి ఉన్న కీలకమైన విచారాలను పరిష్కరించే మా సమగ్రమైన కొత్త ప్లాట్ఫాంతో మారుతి సుజుకీ EV సిద్ధంగా ఉందని ప్రకటించడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. భారతదేశపు అతి పెద్ద డీలర్ నెట్వర్క్, మా ఛార్జింగ్ భాగస్వామి నెట్ వర్క్ ప్రయోజనాలను ఉపయోగించుకుని, భారతదేశంలో ఉన్న అగ్ర 100 నగరాల్లో కీలకమైన ప్రదేశాల్లో సగటున 5-10 కిమీ దూరంలో EV ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయని మేము నిర్థారిస్తున్నాము.
 
మా కాబోయే EV కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా డ్రైవింగ్ స్వాతంత్ర్యానికి వీలు కల్పించడానికి కీలకమైన జాతీయ రహదారులలో క్రమం తప్పకుండా నెలకొని ఉన్నాయి. మనశ్సాంతిని మరింత పెంచడానికి, మా కస్టమర్లు యొక్క ప్రతి అవసరాన్ని నెరవేర్చడానికి 1.5 లక్షల శక్తివంతమైన ప్రత్యేకంగా శిక్షణ పొందిన EV సిబ్బందిని మేము నియామకం చేసాము. దేశంలో ప్రతి ప్రాంతంలో  EV  యాజమాన్యాన్ని మద్దతు చేయడానికి ఆఫ్టర్-సేల్స్ అవసరాలను నెరవేర్చడానికి 1100 నగరాల్లో 1500+ EV-రెడీ  సర్వీస్ వర్క్ షాప్స్ ను  కూడా మేము ప్రారంభించాము.
 
మారుతి సుజుకీ వారి e for me EV ఛార్జింగ్ మొబైల్ యాప్ భాగస్వామిచే నిర్వహించబడే ఛార్జింగ్ పాయింట్ల నుండి సమగ్రంగా EV ఛార్జింగ్ పాయింట్లను వినియోగించడానికి మరియు ఒకే ప్లాట్ ఫాంపై మారుతి సుజుకీ వారి సొంత EV ఛార్జింగ్ నెట్ వర్క్ ను వినియోగించడానికి వీలు కల్పిస్తుంది. ఇది EV ఛార్జింగ్ కోసం ఏకరీతిగా కస్టమర్ కు ప్రయాణాన్ని, UPI ద్వారా లేదా  రేజర్ పే మద్దతు చేసే ప్రత్యేకమైన మారుతి సుజుకీ మనీ ద్వారా చెల్లింపును అందిస్తుంది. e VITARAను బుక్ చేసిన సమయం నుండి, వెహికిల్ హోమ్-ఛార్జర్ ను ఏర్పాటు చేయడానికి, సరైన వినియోగాన్ని నిర్థారించడానికి, పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను గుర్తించడానికి, వాటిని ఉపయోగించడానికి ప్లాట్ ఫాంలోని అనేక ఇతర లక్షణాలతో పాటు e for me యాప్ ఒకే ప్లాట్ ఫాంగా ఉపయోగపడుతుంది.
 
e for me యొక్క కీలకమైన వాస్తవాలు
 
గుర్తించడం, చెల్లించడం-యాప్‌లో లభించే EV ఛార్జింగ్ పాయింట్లను వినియోగించడం.
అదే యాప్ నుండి పబ్లిక్, స్మార్ట్ హోమ్ ఛార్జర్‌ను వినియోగించడం.
మారుతి సుజుకీ డీలర్ అవుట్‌లెట్లలో, హోమ్ ఛార్జర్లో Tap N Charge కోసం ఒక కార్డ్.
నిరంతరంగా ఇన్-కారు EV ఛార్జింగ్ అనుభవం కోసం ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో Mirror e for me యాప్.
దూరం నుండి స్టార్ట్ /స్టాప్ చేయడం, స్మార్ట్ హోమ్ ఛార్జర్ మొదలైన వాటి యొక్క పవర్ అవుట్‌పుట్‌ను నిర్వహించడం.
 
కంపెనీ దృఢమైన EV ఇకోసిస్టంను కూడా అమలు చేసింది, ఇది మారుతి సుజుకీ షోరూం నెట్వర్క్, 1500కి పైగా సర్వీస్ వర్క్‌షాప్స్‌ను EV రెడీగా చేయడం ద్వారా వాటిని ప్రారంభించింది. భారతదేశంలో ఉత్తమమైన EV యాజమాన్య అనుభవాన్ని అందిస్తోంది, దీనికి 1.5 లక్షల మంది EV- రెడీ సిబ్బంది మద్దతు లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments