Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై ఒకటో తేదీ నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన పని లేదు..

జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (10:04 IST)
జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర  మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును విధిగా నింపాల్సి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిపార్చర్ కార్డులో ప్రయాణికుడి పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నంబరు, భారత్‌లోని చిరునామా, విమాన నెంబరు, ప్రయాణిస్తున్న తేదీ తదితర వివరాలను నింపాల్సి ఉండేది. 
 
అయితే జూలై 1 నుంచి ఈ విధానాన్ని తొలగిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ విధానాన్ని ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్యాసెంజర్ నింపుతున్న ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన వివరాల ప్రక్రియ సమయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments