Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కేవైసీ అవసరం లేదు..

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (13:29 IST)
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. బంగారం కొనుగోలు చేసే వారు కేవైసీ డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుందని నివేదికలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతో బంగారు ఆభరణాలు కొనే వారికి ఊరట కలుగనుంది. 
 
బంగారం, వెండి, ఇతర విలువైన రత్నాలను కొనుగోలు చేయాలని భావించే వారు నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తే నో యువర్ కస్టమర్ కేవైసీ అందించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
క్యాష్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఎలాంటి నిబంధనను అమలు చేయలేదని పేర్కొన్నాయి. అధిక విలువ కలిగిన నగదు లావాదేవీలకు మాత్రమే పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి అవసరం అవుతాయి. అంటే రూ.2 లక్షలకు పైన క్యాష్ లావాదేవీలకు కేవైసీ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. 
 
అవినీతి నిరోధక చట్టం 2002 ప్రకారం.. రూ.10 లక్షలు లేదా ఆపైన విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఇతరత్రా వాటి కొనుగోలుకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించినా కూడా కచ్చితంగా కేవైసీ డాక్యుమెంట్లు అందించాలి. అందువల్ల రూ.2 లక్షలకు లోపు బంగారం కొనేవారు కేవైసీ డాక్యుమెంట్లు అందించాల్సిన అవసరం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments