Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయం.. అట్టర్ ఫ్లాప్ : రఘురాం రాజన్

పెద్ద నోట్ల రద్దుపై భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయంగా అభివర్ణించారు. పైగా, ఈ నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. నోట్

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (17:01 IST)
పెద్ద నోట్ల రద్దుపై భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయంగా అభివర్ణించారు. పైగా, ఈ నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల ర‌ద్దు ఉద్దేశం మంచిదే అయినా.. అది విఫ‌ల ప్ర‌యోగంలా మిగిలిపోయింద‌ని వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, దేశంలో ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో చాలాన‌ష్టాలు జ‌రిగాయ‌న్నారు. జీడీపీ వృద్ధి రేటు భారీగా త‌గ్గింది. ఒక‌టి రెండు శాతం త‌గ్గ‌డం అంటే క‌నీసం రూ.2.5 ల‌క్ష‌ల కోట్ల విలువతో సమానమన్నారు. ప్రజ‌ల‌ను రోజుల త‌రబ‌డి క్యూలైన్లలో నిల‌బెట్టారు. కొత్త క‌రెన్సీ ముద్ర‌ణ‌కు భారీగా ఖ‌ర్చ‌యింది. అటు బ్యాంకుల‌కు కూడా ఈ డ‌బ్బు మొత్తాన్ని సేక‌రించ‌డం భార‌మైందన్నారు. 
 
తాను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌పై ఉన్న స‌మ‌యంలో నోట్ల ర‌ద్దు ఎప్పుడు చేయ‌బోతున్నార‌న్న‌దానిపై ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని రాజ‌న్ వెల్ల‌డించారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల జ‌రిగే ల‌బ్ధి, అయ్యే ఖ‌ర్చుల‌పై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో నేను ఉన్నాను. అయితే ఎప్పుడ‌న్న‌దానిపై ఏమీ చెప్ప‌లేదు. 
 
మ‌రోవైపు కొత్త నోట్లు ముద్రించే ప్ర‌క్రియ జ‌రుగుతూనే ఉంది. అయితే అది ఖచ్చితంగా నోట్ల ర‌ద్దు కోస‌మే కాద‌ని అనుకున్నాం. ఎలాగైతేనేమి కొత్త 2000 నోట్లు కొంతైనా నోట్ల ర‌ద్దు ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయి అని రాజ‌న్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments