Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ ప్రాంతాల్లో కరెన్సీ వర్షం... 40 శాతం నోట్లు గ్రామీణ ప్రాంత బ్యాంకులకే

నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకుంది. ఆర్‌బీఐ నుంచి వచ్చే కొత్త నోట్లలో 40 శాతం నోట్లను గ్రామీణ ప్రాంతాలకు పంపాల

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (10:01 IST)
నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకుంది. ఆర్‌బీఐ నుంచి వచ్చే కొత్త నోట్లలో 40 శాతం నోట్లను గ్రామీణ ప్రాంతాలకు పంపాలని అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 
 
నోట్ల రద్దును ప్రకటించి 50 రోజులు గడిచినా కొన్ని చోట్ల నగదు కొరత సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. వారానికి రూ.24 వేలు విత్‌డ్రా పరిమితిని కూడా బ్యాంకులు ఎత్తివేయడంలేదు. మరోపక్క ఆశించిన స్థాయిలో కొత్త నోట్లు గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ మేరకు కొన్ని చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం కష్టాలు తీర్చడం లేదు. 
 
దీంతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 40 శాతం నోట్లను పంపడం ద్వారా నగదు కొరత సమస్యకు ఉపశమనం లభిస్తుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకు చెస్ట్‌లను ఆదేశించింది. అంతేకాకుండా రూ.100 నోటు కన్నా తక్కువ నిల్వ ఉన్న నోట్లను సైతం గ్రామీణ ప్రాంతాలకు పంపాలని సూచించింది. 
 
‘గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖలకు కొత్త నోట్లను పంపాలని బ్యాంకులు తమ చెస్ట్‌లకు ఆదేశాలివ్వాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఏంలు, పోస్టాఫీస్‌లకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ఆర్‌బీఐ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments