Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ .. బంగారంపై రుణాలు.. 90 శాతం పెంపు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (19:16 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులను ఊరట నిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా కష్టకాలంలో అన్నిరకాల రుణాలపై మారటోరియం గడువు పెంచిన ఆర్బీఐ.. తాజాగా బంగారు ఆభరణాలపై తీసుకునే రుణం విలువను పెంచింది. ఇప్పటివరకు ఆర్బీఐ సూచనలు మేరకు మొత్తం బంగారం విలువలో 75 శాతం విలువ మించకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేస్తాయి. 
 
కానీ ఇప్పుడు అలా కాదు.. బంగారం విలువలో ఇప్పుడు 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇప్పటివరకు బంగారం మొత్తం విలువలో 75 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఫలితంగా బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, మొదట మీ బంగారం నాణ్యతను తనిఖీ చేస్తుంది. 
 
రుణ మొత్తాన్ని బంగారం నాణ్యత ప్రకారం నిర్ణయిస్తారు. బ్యాంకులు సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కానీ ఆర్బీఐ తాజా సూచనలతో బంగారం రుణం విలువ 90 శాతం పెంచింది. సాధారణంగా, 18 నుండి 24 క్యారెట్ల బంగారం మంచి మొత్తాన్ని ఇస్తుంది.

తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో​ 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. కరోనా సంక్షోభంలో ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments