Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠారెత్తిస్తున్న టమోటా ధర.. కేజీ రూ.80

దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమోటా కేజీ రూ.80గా పలుకుతోది. ఈ పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, రైతు బజార్లలో

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (12:59 IST)
దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమోటా కేజీ రూ.80గా పలుకుతోది. ఈ పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, రైతు బజార్లలో రూ.30 వరకు ఉంది. అయితే రైతు బజార్లకు వచ్చే టమోటాలో నాణ్యత ఉండటం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. 
 
టమోటా ధర పెరుగుదలకు వ్యాపారులు రెండు కారణాలు చెబుతున్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో టమోటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేసమయంలో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో టమోటాకు విపరీతమైన డిమాండ్‌ వచ్చింది.
 
దీంతో ధర అమాంతం పెరిగింది. గుజరాత్‌, మహరాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటకల్లో సాగు చేసిన టమోటాకు బాగా నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మదనపల్లెలో సాగు చేసిన టమోటాను కొనుగోలు చేస్తున్నారు. దీంతో టమోటాకు డిమాండ్‌ పెరిగి, మదనపల్లెలోనే క్వింటాలు రూ.4 వేలు పలుకుతోంది. అక్కడ మిగిలిన టమోటాను విజయవాడకు తరలిస్తున్నారు.
 
పెరిగిన, రవాణా ఖర్చులు కలిపితే ధర 30 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రైతుబజారుల్లో టమోటా కిలో రూ.30 నుంచి 33 వరకు అమ్ముతున్నా, నాణ్యమైనవి దొరకడం లేదు. బహిరంగ మార్కెట్లో ధర రూ.60 వరకు పలుకుతోంది. ఈ పరిస్థితి మరో 3 నెలల వరకు గాడినపడే పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కిలో రూ.70 నుంచి 80కి చేరే అవకాశం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments