Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ నెంబర్ వుంటే హ్యాక్ చేయడం సులభం.. మోదీ మీ నెంబర్ ఇస్తారా?

ఆధార్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు లింక్ చేసేయమని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆధార్‌ సంఖ్య తెలిసినంత మాత్రాన వ్యక్తిగత వివరాలేవీ తెలిసిపోవని, ఎవరూ దాన్ని

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (13:10 IST)
ఆధార్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు లింక్ చేసేయమని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆధార్‌ సంఖ్య తెలిసినంత మాత్రాన వ్యక్తిగత వివరాలేవీ తెలిసిపోవని, ఎవరూ దాన్ని దుర్వినియోగం చేయలేరని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ గట్టిగా వాదించారు. 
 
ఇంకా తన 12 అంకెల ఆధార్‌ నంబరును బయటపెట్టారు. తన డేటా వివరాలను చౌర్యం చేయాలని సవాల్‌ విసిరారు. దానిని స్వీకరించిన ఇలియట్‌ ఆల్డర్సన్‌ అనే ఫ్రెంచి సైబర్‌ నిపుణుడు శర్మ వివరాలను బయటపెట్టేశారు. ఈ డేటా ప్రకారం ఇంటి అడ్రెస్, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ వంటి వివరాలను వెల్లడించారు. ఇలాంటి సవాళ్లను విసరొద్దని.. ఆధార్‌ నంబరు తెలిస్తే హ్యాక్‌ చేయడం పెద్ద కష్టం కాదని హితవు పలికారు. 
 
అయితే, ఇది హ్యాకింగ్‌ కాదని, గూగుల్‌లో వెతికితే ఇటువంటి వివరాలను ఎవరైనా బయట పెడతారని శర్మ, యూఐడీఏఐ వాదించారు. మరోవైపు ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ ఆధార్‌ వివరాలు, బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేసిన ఫ్రెంచి సైబర్‌ నిపుణుడు ఇలియట్‌ ఆల్డర్సన్‌ ప్రధాన మంత్రి మోదీకీ సవాల్‌ విసిరారు. ''ప్రధానీ.. మీ ఆధార్‌ నంబరును బయటపెడతారా!?'' అని ట్విట్టర్లో అడిగాడు. దానిని కూడా హ్యాక్ చేసి చూపిస్తామని అతడు స్పష్టం చేశాడు. 
 
కాగా, ఆధార్‌కు సంబంధించి పౌరుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు రూపొందించిన బిల్లు నివేదికను కోర్టు ముందు ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 ఆధార్‌ చట్టానికి రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments