పొటాటో, చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దాం..? (వీడియో)

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (12:06 IST)
బంగాళా దుంపల్లో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి పిల్లల్లో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. ఇంకా విటమిన్ బి పిల్లల్లో ఎనర్జీని ఇస్తాయి. విటమిన్ సి పిల్లల చర్మ ఆరోగ్యానికి, ఎముకలకు, కేశాలకు మేలు చేస్తుంది. ఇక చీజ్ విషయానికి వస్తే.. ఇది డైరీ ఫుడ్ కావడంతో క్యాల్షియంను అందజేస్తుంది. అలాంటి పొటాటో, చీజ్ కాంబోలో బాల్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
ఉడికించిన బంగాళాదుంపలు - అరకేజీ 
ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్ 
కారం - ఒకటిన్నర స్పూన్ 
మిరియాల పొడి - ఒక స్పూన్
కార్న్ చిప్స్ - రెండు కప్పులు 
కార్న్ ఫ్లోర్ - ఒక కప్పు 
చీజ్ - ఒక కప్పు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
నూనె, ఉప్పు- తగినంత 
 
తయారీ విధానం.. 
ముందుగా బంగాళాదుంపలను బాగా ఉడికించాలి. వాటిని ఓ బౌల్‌లోకి తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ పొటాటో స్మాష్‌కి ధనియాల పొడి, కారం, మిరియాల పొడి, ఒక కప్పు కార్న్ ఫ్లోర్, కొత్తిమీర తరుగు, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా చేసుకుని.. చీజ్‌ను ఆ బాల్స్‌కు మధ్య వుంచి.. రౌండ్ చేసుకోవాలి. వీటిని ప్లేటులో పక్కన బెట్టుకుని.. ఇంతలో ఓ కప్పులోకి కార్న్ ఫ్లోర్‌ తీసుకుని జారుగా కలుపుకోవాలి.

ఈ కార్న్ ఫ్లోర్‌లో సిద్ధం చేసుకున్న పొటాటో బాల్స్‌ను డిప్ చేసి.. కార్న్ చిప్స్‌లో మళ్లీ డిప్ చేసి పక్కనబెట్టుకోవాలి. వీటిని నూనెలో వేసి బాల్ గోల్డెన్ రంగు వచ్చే వరకు ఉడికించి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయినట్లే. ఈ బాల్స్‌ను కాస్త వేడి తగ్గిన తర్వాత టమోటా సాస్‌తో పిల్లలకు సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heat Wave Alert: ఏప్రిల్ 10కి తర్వాత తెలంగాణలో వడగాలులు

36 రోజులుగా ఇంటర్‌నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!

మంగళవారం ఇరాన్‌లో మరణమృదంగం వినిపిస్తా, రానున్న 48 గంటల్లో బీభత్సం: ట్రంప్ వార్నింగ్

ఆటో సీటు కవర్ చింపేశాడని.. ఏడేళ్ల కుమారుడికి వాతపెట్టిన సైకో తండ్రి

అక్రమ సంబంధం: భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.. పెట్రోల్ పోసి, గోధుమ గడ్డి కప్పి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments