గారెల పిండి అన్నానికి లింక్ ఏంటీ..?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (18:07 IST)
నేటి తరుణంలో ఆరోగ్యంగా జీవించాలంటే పదార్థాలు శుభ్రంగా ఉంటేనే అది సాధ్యం. కాబట్టి ఈ చిట్కాలు పాటించాలంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
 
1. పప్పు ఉడికిన తరువాతనే ఉప్పు వేయండి. మొదటే వేస్తే ఉప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అరటిపూసలోని పీచు తీసేయాలంటే పూసను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొంచెం మజ్జిగ చిలకరిస్తే పీచు కవ్వంతో తేలికగా వస్తుంది.
 
2. ఉల్లిపాయలు తరిగేందుకు అరగంట ముందు వాటిని పాలిథిన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే తరిగేటప్పుడు కళ్ళు మండవు. దోసకాయలు చేదుగా ఉంటే ఉప్పు నీళ్లల్లో ఉడకబెట్టండి. చేదు పోతుంది.
 
3. గారెల పిండి రుబ్బేటప్పుడు రెండు గరిటెల అన్నం వేసి మెత్తగా రుబ్బండి. ఈ పిండితో చేసిన గారెలు ఎంతో రుచిగా ఉండి, కరకరలాడుతుంటాయి. 
 
4. వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో ఒక కప్పు నూనె వేసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచండి. ఒకటి రెండు వెల్లుల్లి రేకులు అవసరమైనప్పుడు పనిగట్టుకుని నూరకుండా ఈ నూనె ఒక చెంచా ఉపయోగిస్తే సరిపోతుంది. వంటకానికి రుచి, వాసనా వస్తాయి.
 
5. బెల్లపు పాకం గానీ, పంచదార పాకం గానీ పట్టేటప్పుడు త్వరగా ముదురు పాకానికి వస్తే రెండు స్పూన్ల పాలు పోసి కదపండి. పాకం లేతగా అవుతుంది. కుక్కర్ గాస్కెట్ ఉపయోగించిన వెంటనే ఐస్‌ వాటర్‌లో ముంచితే ఎక్కువ రోజులు మన్నుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముస్సోరీలో టెకీ రాధా గాయత్రి మృతి: అల్లుడుపై అనుమానం అంటూ అత్తమామలు ఫిర్యాదు

నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో వుండాలి: జగన్

ధర్మస్థల కేసు : చిన్నయ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదు : ప్రకాష్ రాజ్

వివాహమైన 48 రోజుల్లో వివాహిత అనుమానాస్పద మృతి

వరకట్నం వేధింపులు.. ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు.. 45 రోజులకే నవవధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha diet: నేను పెద్దగా తినలేను అందుకే బరువు తగ్గాను : సమంత ప్రభు

విజయ్‌ విజయం.. అకస్మాత్తుగా రాలేదు : సమంత

Divija: ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్‌గా వెంకట్రామయ్య గారి తాలూకా

నిజ జీవితపు ఘటనలకు చేతబడులు, క్షుద్ర పూజల కథే కళాంకి భైరవుడు

Peddi 56-second addition: రామ్ చరణ్ పెద్ది లో నిమిషాల 56 సెకన్ల కొత్త జోడింపు లాభించేనా?

తర్వాతి కథనం
Show comments