సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:14 IST)
కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలా కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పు జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే.. మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిల్వవుంటాయి. అల్లం. పచ్చిమిర్చి కూడా అలానే మెత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి ఉప్పు వేసి నిల్వచేసుకోవచ్చు.
 
1. ఖాళీ అయిన నెయ్యి లేదా నూనె ప్యాకెట్లలో పప్పులు నిలువ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ధనియాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని బాణలిలో కాసేపు వేడిచేసి ఆపై డబ్బాలో నిల్వచేస్తే చాలాకాలం వరకు నిల్వ ఉంటాయి. 
 
2. పప్పులు, ఉప్పులు వేసుకునే సీసాలు మురికిగా ఉన్నట్లైతే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలిపి ఆ తర్వాత నీటితో కడిగితే జిడ్డంతా తొలగిపోతుంది. అలానే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన కొన్ని బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటాయి. 
 
3. సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా.. సగం తరిగిన బంగాళదుంప ముక్కను సూప్‌లో వేయండి. 15 నిమిషాల తరువాత తక్కువ మంటమీద సూప్‌ను వేడిచేస్తే ఉప్పును పీల్చేస్తుంది. ఆపై బంగాళదుంపను తీసేయొచ్చు.
 
4. పుదీనా, మిరియాలపొడి వంటి వాటిని సూప్‌‍లలో ఎక్కువగా చేర్చండి. అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది. మంచి రుచితోపాటు బలవర్థకం కూడా. సూప్‌లు చిక్కగా రావాలంటే.. మీకు నచ్చిన కూరగాయల్ని ఉడికించి తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో కలిపితే చాలా బాగుంటుంది.
 
5. ఎక్కువ రోజుల నుండి వాడుతున్న వంటసోడా సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఇలా చేయండి.. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా వంటసోడా వేయండి. నీటిలో వెంటనే బుడగలు వస్తే అది చక్కగా పనికొస్తుందని అర్థం.
 
6. ఆకుకూరలు, కూరగాయలను కడిగేటప్పుడు నీళ్ళల్లో చిటికెడు వంటసోడా చేరిస్తే.. వండిన తర్వాత ఆకుకూరలు రంగు మారకుండా ఉంటాయి. అంతేకాదు కుళాయి నుండి పట్టిన నీళ్లలో సూక్ష్మక్రిములు ఉంటే కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments