కోడిగుడ్డును అలా పగలగొట్టాలి, అలా చేస్తే చాలా ఈజీ

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (21:20 IST)
మహిళలు వంటింట్లో కొన్ని పనులను తేలికగా చేయవచ్చు అనే విషయం తెలియకపోవడంతో పని మరింత పెరుగుతుంది. ఈ క్రింది చిట్కాలు పాటిస్తే వంటింట్లో మరింత సులభంగా పనులు కానించేయవచ్చు.
 
* గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ను తరుచూ నిమ్మరసంలో నానబెట్టి శుభ్రపరచాలి. అప్పుడే దానిపై చేరుకొని ఉన్న హానికారక క్రిముల దూరమవుతాయి.
 
* వంటసోడాలో నీళ్లు కలిపి మిశ్రమంలా తయారు చేసి వెండి వస్తువులను రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
 
* కొవ్వొత్తులని ఫ్రిజ్‌లో ఉంచి.. వెలిగిస్తే ఎక్కువ సేపు వెలుగుతాయి.
 
* ప్రమిదలని నీటిలో నానబెడితే నూనెని ఎక్కువగా పీల్చుకోవు.
 
* అగరొత్తుల బూడిదతో వెండి వస్తువులను తోమితే కొత్త వాటిలా మెరుస్తాయి.
 
* బాణలిలో పదార్థాలు అంటుకుపోతే నీళ్లు పోసి అందులో చారెడు ఉప్పు వేసి మరిగించాలి. కొద్దిసేపటికి నీళ్లు పోసేసి కాగితంతో రుద్దితే పాన్ శుభ్రపడుతుంది.
 
* క్రీమ్ చీజ్ ఇంట్లో అందుబాటులో లేనప్పుడు పనీర్‌ను చేత్తో మెత్తగా చేసి చిక్కటి పెరుగులో వేసి వాడుకుంటే సరిపోతుంది.
 
* గదిని శుభ్రం చేసే నీటిలో అరకప్పు గులాబీనీటిని కూడా జోడిస్తే గదంతా పరిమళభరితంగా ఉంటుంది.
 
* పొట్టు తీసిన వెల్లుల్లిరేకలను కప్పు వంటనూనెలో వేసుకొని ఉంచితే ఆ నూనె చక్కటి వాసన వస్తుంది. 
 
* కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొడితే తర్వాత శుభ్రపరచడం తేలిక అవుతుంది.
 
* ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.35 కోట్ల హార్స్ ట్రేడింగ్

లంచాలు తీసుకుని అయోధ్యలో ఉద్యోగాలు.. తవ్వే కొద్దీ అవినీతి మరకలు

50 కిలోల కల్తీ... మేక మాంసంలో గోమాంసం కలిపారు..

Venezuela earthquake: 2,295కి పెరిగిన వెనిజులా భూకంప మృతుల సంఖ్య

యూట్యూబర్ రావణ్‌కు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు.. మరో కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: అఖిల్ అక్కినేని రగ్గడ్ లెనిన్ ట్రైలర్ 10 మిలియన్ల దాటి ఉత్సాహానిచ్చింది

రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి

Sureshbabu: నాగబంధం సెట్ అభిషేక్ చూడమని చెప్పారు, అద్భుతమైన విజువల్స్ వున్నాయి : డి. సురేష్ బాబు

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

తర్వాతి కథనం
Show comments