కంటికి మేలు కలిగించే వంటకాలు... మీ కోసం...

కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువశాతం మంది ఇష్టపడరు.

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (15:28 IST)
కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువశాతం మంది ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలిగిస్తాయని, ఇందులోని క్యాలరీలు పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదిగేలా చేయడమే కాకుండా మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయి. 
 
వండితే ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ రూపంలో తీసుకున్నట్లైతే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. క్యారెట్‌లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజలవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. క్యారెట్ సలాడ్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్దాలు: 
సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు - 1 కప్పు
కొబ్బరి తురుము - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 3 
కొందిగ కరివేపాకు
ఉప్పు - 2 స్పూన్స్
నూనె సరిపడ
పోపు దినుసులు
 
తయారు చేసేవిధానం:
ముందుగా బాండీలో కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, వేసి వేయించాలి. పోపు దినుసులు వేగాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకున్న తరువాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకుని కాసేపు తరువాత ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్ళుపోసి మూత పెట్టుకోవాలి. పావుగంట తరువాత మూత తీసి కలుపుకుని కూర పూర్తిగా ఉడికిన తరువాత కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుని బాగా కలుపుకుని దించుకుంటే ఘుమఘుమలాడే క్యారెట్ సలాడ్ రెడి.
 
మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, సోడియం, మాంగనీస్, సిలికాస్, అయోడిన్‌లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరస్ వంటి ఖనిజాలను సరఫరాచేస్తుంది. అతి ఉత్తమమైన సహజమైన కాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు. 
 
ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ, ఎముకలకు, మంచి చర్మానికి కావలసిన అత్యావశ్యకమైన పదార్థం. అంతేకాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటికి వచ్చిన భర్త... ప్రియుడితో నగ్నంగా కనిపించిన 9 మంది పిల్లల భార్య... తర్వాత ఏం జరిగింది...

అత్యాచారం చేసిన నిందితుడికి రూ. 1 లక్ష జరిమానా: అడ్వాన్స్ రూ.20 వేలతో మద్యం పార్టీ

రైళ్ళలో దొంగలుపడ్డారు... ఫేస్ టవల్స్ చోరీతో రూ.104.51 కోట్ల నష్టం

అమ్మాయిలతో టీడీపీ మంత్రి అనుచరుల చిందులు? (వీడియో)

మనవరాలిని కారు డ్రైవింగ్ చేయమన్న సబ్ ఇన్‌స్పెక్టర్.. తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maheshbabu: బాబాయ్ అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు, మీ ఆశీర్వాదం కావాలి: జై కృష్ణ ఘట్టమనేని

సినీ రంగ ప్రవేశం చేయనున్న బాలకృష్ణ తనయ తేజస్విని?

క్రైమ్, కామెడీ అంశాలతో చోర శికామణులు చిత్రం ప్రారంభం

Rashmika : రణబాలి చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్

Ramayanam trailer: మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో రామాయణం ట్రైలర్ అదుర్స్

తర్వాతి కథనం
Show comments