ఆంధ్రాలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (18:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. నిజానికి గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ కేసులు ఇపుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
ఇందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 385 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 316, నెల్లూరు జిల్లాలో 269, ప్రకాశం జిల్లాలో 241, పశ్చిమ గోదావరి జిల్లాలో 222 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 27 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 2,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 13,256 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,54,765 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,19,354 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,155 మందికి చికిత్స జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

Namit Malhotra :ఈ రోజు విడుదల కావాల్సిన రామాయణ ట్రైలర్ వాయిదా పడింది.

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

తర్వాతి కథనం
Show comments