Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న కర్నూలు.. నేడు కృష్ణా - ఏపీలో వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం కూడా దృష్టి కేంద్రీకరించింది. ఇదే విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఏపీలో శనివారం కొత్తగా మరో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
శనివారం ఉదయం 10 గంటలకు ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ 135 ప్రకారం... 61 కొత్త కేసులు నమోదు కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కు చేరింది. ఇప్పటివరకు 171 మంది డిశ్చార్జ్ కాగా.. 31 మంది మృతిచెందారు.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, 24 గంటల్లో ఇద్దరు మృతిచెందారు.  
 
గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదుకాగా, ఆ తర్వాత కర్నూలులో 14 నమోదు కాగా... అనంతపురంలో 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, కడపలో 4, నెల్లూరులో 4, శ్రీకాకుళం 3 కేసులు నమోదు అయ్యాయి. 
 
గత 24 గంటల్లో 6,928 శాంపిల్స్‌ను పరీక్షించగా 61 పాజిటివ్‌గా వచ్చాయి. ఇక, కర్నూలులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందగా.. మృతుల సంఖ్య 31కి చేరింది. 13 జిల్లాల్లో అత్యధికంగా ఒక్క కర్నూలులోనే 259 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరులో 209, కృష్ణా జిల్లాలో 127 కేసులు నమోదు అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments