Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 దాడి!

Webdunia
బుధవారం, 5 మే 2021 (12:21 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పేషెంట్స్ ‌తో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. చాలామందికి ఆక్సిజన్‌తో కూడిన పడకలు లభించక హాస్పిటల్ ఆవరణలోనే తుది శ్వాస విడుస్తున్నారు. 
 
హాస్పిటల్స్‌లో వాతావరణంను ఎవరూ వర్ణించలేరు. ఇక మృతిచెందినవారి దహన సంస్కారాలకు స్మశానవాటికలో చోటు దొరకడం లేదు. రోజుకు ఇద్దరు లేదా ముగ్గురిని ఖననం చేసే కాటికాపరులు... ఇప్పుడు రోజుకు 15 నుంచి 20 మందికి దహన సంస్కారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ మేరకు పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో వైరస్‌కు చెందిన డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 దాడి చేస్తోందని సెంటర్ ఫర్ సెల్యూలర్ మరియు మోలెక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
ఇది N440K వేరియంట్‌ను రీప్లేస్ చేసిందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. 5వేల వేరియంట్లను సేకరించి వారిని విశ్లేషించనట్లు చెప్పిన శాస్త్రవేత్తలు... N440K వేరియంట్ దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాప్తి చెందిందని చెప్పారు. 
 
అయితే ఈ మధ్యకాలంలో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 వేరియంట్ N440Kని రీప్లేస్ చేస్తూ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. ఇది కేరళను కూడా తాకినట్లు సీసీఎంబీలో పనిచేసే మరో శాస్త్రవేత్త దివ్య తేజ్ సోపతి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments