Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి గుప్పిట్లో భారత్.. 24 గంటల్లో 459మంది మృతి

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:23 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 459 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 11,25,681 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..72,330 మందికి పాజిటివ్‌గా తేలింది. అక్టోబర్ ప్రారంభంలో ఈ స్థాయి విజృంభణ కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కి చేరగా.. 1,62,927 మంది ప్రాణాలు కోల్పోయారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
రోజురోజుకూ క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 5,84,055 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 4.55 శాతానికి చేరింది. నిన్న 40,382 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.14కోట్ల పైచిలుకు మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా..రికవరీ రేటు 94.11 శాతంగా ఉంది.
 
ఆదివారం, హోలీ సెలవుల కారణంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంతో కొత్త కేసులు తగ్గినట్లు కనిపించాయి. కానీ, మళ్లీ ఇప్పుడు కరోనా అసలు తీవ్రత కనిపిస్తోంది. మహమ్మారితో అతలాకుతలం అవుతోన్న మహారాష్ట్రలో.. తాజాగా 39,544 కొత్త కేసులు వెలుగుచూశాయి. 227 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో.. సుమారు సగం మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే వెలుగుచూడటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments