Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకాలతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ: అమెరికా పరిశోధన

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (14:35 IST)
కరోనా టీకాలతో ఇబ్బందులు తప్పవని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా ఎంఆర్ఎన్‌ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ డాక్టర్ జోసెఫ్ తెలిపారు. అయితే భారత్‌లో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే
 
ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై (సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్‌) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం.
 
ఎంఆర్ఎన్‌ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది.
 
ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతతో ఉండాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments