Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతారాం ఏచూరి ఇంట విషాదం.. కరోనాతో కుమారుడు మృతి!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (09:49 IST)
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు సీనియర్ రాజకీయ నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్‌ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఆయన వయసు 34 యేళ్లు. ఈయన న్యూఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్‌ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
 
రెండు వారాల క్రితం కరోనా బారినపడిన ఆశిష్.. గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆశిష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.
 
"నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందాడని చెప్పడానికి నేను బాధపడుతున్నాను. డాక్టర్లు, నర్సులు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు, శానిటేషన్ చేసిన సిబ్బందికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు తెలిపుతున్నాను" సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments