Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న తీవ్రత - 81 రోజుల తర్వాత... 60 వేల దిగువకు...

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (11:02 IST)
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఇందులోభాగంగా గత 81 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 58,419 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
గడిచిన 24 గంటల్లో 1,576 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే, గత 24 గంటల్లో 87,619 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,87,66,009 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. 
 
దేశంలో ప్రస్తుతం 7,29,243 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2,98,81,965 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో ఇప్పటివరకు 27.66 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఇదిలావుంటే, కోవిడ్-19 బాధితులకు రూ.4 లక్షల పరిహారం చెల్లించలేమని, పరిహారం తప్పనిసరి చేసే విపత్తు నిర్వహణ చట్టం భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
కరోనా వైరస్‌ కారణంగా 3.85 లక్షల మందికి పైగా కరోనా బాధితులు మరణించారని, ఇది పెరిగే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. పెరిగిన ఆరోగ్య ఖర్చులు, తక్కువ పన్ను ఆదాయాల కారణంగా లక్షలాది మంది కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించడం రాష్ట్రాల బడ్జెట్‌కు మించినదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. 
 
భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని విపత్తు నిర్వహణ చట్టం పేర్కొందని తెలిపింది. కరోనా మహమ్మారి భారీ స్థాయిలో ఉన్నందున దీనిని కోవిడ్‌కు వర్తింపచేయడం సముచితం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిహారం ఇవ్వడానికి అరుదైన వనరులను ఉపయోగించడం, ఆరోగ్యం పై చేసే వ్యయాన్ని ప్రభావితం చేసి, మంచి కంటే ఎక్కువ నష్టం కలిగిస్తుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. 
 
చాలా వరకు ప్రతి బాధితుడి మరణ ధృవీకరణ పత్రాల్లో "కోవిడ్ డెత్" అని జారీ చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇక కోవిడ్ బాధితులకు రూ.4 లక్షల పరిహారం కోరుతూ ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments