Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులూ జరజాగ్రత్త... సీఎం ప్రెస్‌మీట్‌కెళ్లిన విలేకరికి కరోనా

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (10:12 IST)
వర్కింగ్ జర్నలిస్టుల కాస్తంత వళ్లుదగ్గర పెట్టుకుని పనిచేయాలని కరోనా వైరస్ హెచ్చరించింది. కరోనా ఏం చేస్తుందిలే అని భావించి ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ తిరిగినా, ఇష్టానుసారంగా ప్రెస్‌మీట్లకు వెళ్లినా తాను సోకకుండా మానను అని హెచ్చరించింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌కు వెళ్లిన ఓ విలేకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ సమావేశానికి హాజరైన విలేఖరులందరినీ హౌస్ క్వారంటైన్‌కు పంపుతూ ఆదేశాలు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మార్చి 20వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జర్నలిస్టుకు తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు అదే సమావేశానికి హాజరైన మిగతా జర్నలిస్టులను హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని సూచించారు. కాగా, బాధిత జర్నలిస్టుకు అతడి కుమార్తె ద్వారా ఈ వైరస్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు.
 
మార్చి 17న ఆయన కుమార్తె లండన్ నుంచి వచ్చిందని, ఆమెతో ఉండడం వల్లే వైరస్ సోకి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. 
 
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 519 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క భోపాల్‌లోనే 15 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments