Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:07 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 42,982 క‌రోనా కేసులు న‌మోదు కాగా, గురువారం 44,643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
అలాగే, 24 గంట‌ల్లో 41,096 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే... గడిచిన 24 గంటల్లో 464 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,26,754కు పెరిగింది. 
 
మరోవైపు, దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,15,844 మంది కోలుకున్నారు. 4,14,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 49,53,27,595 వ్యాక్సిన్ డోసులు వేశారు.
 
ఇదిలావుంటే, తెలంగాణలో గురువారం వైద్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో 1,07,329 కరోనా పరీక్షలు నిర్వహించగా, 582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదయ్యాయి. 
 
వరంగల్ అర్బన్ జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 61 కేసులు వెల్లడయ్యాయి. ఖమ్మం జిల్లాలో 45 కేసులు గుర్తించారు. కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments