దేశంలో పడగ విప్పిన కరోనా కేసులు.. థర్డ్‌వేవ్‌కు ఒమిక్రాన్ కారణం!

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (15:13 IST)
దేశంలో కరోనా వైరస్ మరోమారు పడగవిప్పింది. ఫలితంగా గడిచిన  24 గంటల్లో ఏకంగా ఒకటిన్నర లక్షల పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. పైగా, కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం ఒమిక్రాన్ వైరస్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా, సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాతే కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇందులో భారత్ కూడా కూడా ఉంది. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 
 
దీనికి కారణం ఒమిక్రాన్ వైరస్ అయివుంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులు కూడా ఇప్పటికే దేశంలో 3500కు దాటేసింది. ఇందులో మహారాష్ట్రలోఅత్యధికంగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
వరుణ్ గాంధీకి కరోనా 
భారతీయ జనతా పార్టీకి చెందిన యువ నేత వరుణ్ గాంధీకి కరోనా వైరస్ సోకింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయన ఫిలిబిత్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనాబారినపడ్డారు. తనకు తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని, స్వయంగా వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం  కూడా సాగుతోంది. అందువల్ల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలకు ఎన్నికల సంఘం ముందుగా వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్ కేసులు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరింది. ఈ కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 కేసులు నమోదుకాగా, తర్వాత స్థాంలో ఢిల్లీ 513 కేసులతో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో 123 ఒమిక్రాన్ కేసులు ఉండగా, కర్నాటకలో 441, రాజస్థాన్ రాష్ట్రంలో 373, కేరళలో 333, గుజరాత్‌లో 204 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 1,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
దేశంలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి 40,863 మంది కోలుకున్నారు. ఈ కొత్త కేసులతో కలుపుకంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,53,603కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

డైరెక్షన్ ఇంట్రెస్ట్, మరోవైపు తమిళ్ లో జననాయకన్ కూ అవకాశం వచ్చింది : కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments