ఏడేళ్ళ బాలుడికి కరోనా... తెలంగాణాలో భయపెడుతున్న వైరస్

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజలతో పాటు... అధికార యంత్రాంగాన్ని భయపెడుతుంది. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. మరోవైపు, తెలంగాణాలో ఏడేళ్ళ బాలుడికి కరోనా వైరస్ సోకింది. 
 
గత నెల 17వ తేదీన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి (36) స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థకు చెందిన అతిథి గృహంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికి పంపించారు. 
 
అయితే, ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమారుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానించి పరీక్షలు చేయించగా ఈ నెల 12న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారితోపాటు, అతడి తండ్రిని కూడా అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మిగతా నలుగురి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం వారంతా పటాన్‌చెరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణా రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే ఏకంగా 61 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇది రెండోసారి. గత వారం ఒక్క రోజే 75 కేసులు వెలుగుచూసిన విషయం తెల్సిందే. ఈ తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 592కు పెరిగింది. 
 
వీటిలో హైదరాబాద్‌లో నమోదైన కేసులే 267 ఉండడం గమనార్హం. అలాగే, రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 103 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఐదు జిల్లాల్లో మినహా 28 జిల్లాల్లో వైరస్ విస్తరించింది. మరోవైపు వైరస్ తీవ్రంగా ఉన్న 246 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. 6,41,194 ఇళ్లలో ఇంటింటి సర్వే చేపట్టి 27,32,644 మందిని పరీక్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments