అత్యంత డేంజర్‌గా కరోనా న్యూ వేరియంట్... ఒకరి నుంచి ముగ్గురికి వ్యాప్తి..

Webdunia
మంగళవారం, 4 మే 2021 (15:54 IST)
దేశంలో కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటుంది. ఇలాంటి రూపాల్లో ఒకటి రెండో దశ వైరస్. ఇప్పటికే దేశంలో రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఇది ఒకరి నుంచి ముగ్గురు సోకుతుందట. ఇది 2 నుంచి 2.5 రెట్లు శక్తిమంతమైన వైరస్ అని గుర్తించారు. ఇందువల్లే దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు సమాచారం. 
 
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో వ్యాప్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరం అని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి చెందుతోందని, ఆ ముగ్గురి నుంచి అది మరింతమందికి వ్యాపిస్తోందని వివరించారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని, తొలి దశ కంటే రెండో దశ వైరస్ 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తిమంతమైనదని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ కారణంగా కేసులే కాదు, మరణాలు కూడా పెరుగుతున్నాయని టాటా ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్ట్ సమన్వయకర్త సందీప్ జునేజా పేర్కొన్నారు. 
 
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొవిడ్ మృత్యుఘంటికలు మోగించడానికి గల కారణాలను పరిశోధిస్తున్నామని పరిశోధక బృందం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ఇదే ఊపులో కొనసాగితే జూన్ 1 నాటికి కరోనా మరణాల సంఖ్య అదుపులోకి వస్తుందని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, గత కొన్నిరోజులుగా కరోనా సునామీని చవిచూసిన భారత్‌లో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖంపడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 3,20,289 మంది కోలుకోగా... 3,449 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 2,22,408కి పెరిగింది.  ఇక, తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. 
 
ఇప్పటివరకు భారత్‌లో 2,02,82,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,66,13,292 మంది కరోనా నుంచి విముక్తులవగా, ఇంకా 34,47,133 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ విషయానికొస్తే... 15,89,32,921 మందికి టీకాలు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం శారీరకంగా సిద్ధమైన సమంత

Rashmika Mandanna: ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక మందన్న వివాహం

FCA: ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

Radhika Apte, Taapsee: ప్యాడెడ్ బ్రాలు గురించి గళం విఫ్పిన రాధికా ఆప్టే, తాప్సీ పన్ను

Taapsee Pannu: బాలీవుడ్‌లో క్లీవేజ్ చూపిస్తే.. సౌత్‌లో నాభిపైనే ఫోకస్ చేస్తారు.. తాప్సీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

తర్వాతి కథనం
Show comments