తెలంగాణలో కరోనా అప్డేట్.. 617 పాజిటివ్‌ కేసులు

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (10:00 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి 8గంటల వరకు 45,227 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 617 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,518కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 635 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,74,260కి చేరింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 6,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 4,400 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 65,20,993కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments