Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంఐసొలేషన్‌లో ఎలాంటి మందులు వాడాలి?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:04 IST)
కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా వైద్యం చేయించుకుంటున్నారు. అయితే, ఈ వైరస్‌పై ఫలానా మందు మర్థవంతంగా పని చేస్తుందని నిర్ధారణతో చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు ప్రపంచంలోనే లేవు. ఆరంభంలో హైడ్రాక్సిక్లోరోక్విన్‌, పారాసిట్మాల్ మాత్ర అని.. ఇంకేదో అని వాడేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌ కూడా విరివిగా వాడేస్తున్నారు. 
 
ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విటమిన్ల మాత్రలను కూడా చాలామంది వేసుకుంటున్నారు. వీటివల్ల పెద్దగా ఉపయోగాలుండవు. ఇక ఆయుర్వేదం అని, హోమియో అని కూడా వాడుతున్నారు. కర్పూరం, అల్లం, శొంఠి వంటి పదార్థాలను వడగట్టి పీల్చితే పోతుందని కూడా వాట్సాప్‌లో ప్రచారం జరుగుతున్నది. దీనివల్ల కూడా కరోనా తగ్గదు. 
 
కరోనా అనేక రూపాంతరాలు చెందింది. అందరిపై ఒకేలా ప్రభావం చూపించడంలేదు. కరోనా సోకినవారు వైద్యులను సంప్రదించి మందులను వాడడం మంచిది. లేదంటే ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మందులువాడాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments