24 గంటల్లో 20 వేల కరోనా పాజిటివ్ కేసులు.. ఈ వేగం ఎక్కడికి తీసుకెళ్తుంది?

Webdunia
గురువారం, 2 జులై 2020 (14:05 IST)
దేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20 వేలకు దగ్గరగా అంటే, 19,148 కేసులు నమోదయ్యాయి. ఇందులో 434 మంది ప్రాణాలు విడిచారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారము దేశం మెత్తంలో 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2,26,947 యాక్టివ్ కేసులు ఉండగా 3,59,859 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,29,588 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 90,56,173 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడమైనది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2లో నటించనున్న సాయిపల్లవి?

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్

శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్

తర్వాతి కథనం
Show comments