Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనై భోస్లేతో సిరాజ్ డేటింగా? ఆమె నా సోదరితో సమానమంటున్న క్రికెటర్!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (10:37 IST)
ప్రముఖ బాలీవుడ్ గాయని జనై భోస్లేతో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్‌లో ఉన్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా, ముంబైలోని బాంద్రాలో జరిగిన జనై భోస్లే 23వ జన్మదిన వేడుకల్లో సిరాజ్ పాల్గొనడం, ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ‌్‌లో పోస్ట్ చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. ఆ ఫోటోలలో సిరాజ్, జనై చాలా సన్నిహితంగా కనిపించడంతో వీరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వారిద్దరిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ, కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారంపై సిరాజ్ స్పందించారు. 
 
తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జనై తనకు సోదరి లాంటిదన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌‍స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. "ఆమెలాంటి సోదరి నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నేను ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లుగా, ఆమె వెయ్యి మందిలో ఒకరు" అంటూ కవితాత్మకంగా రాసుకొచ్చారు. 
 
మరోవైపు జనై కూడా ఈ పుకార్లపై స్పందిస్తూ, సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొన్నారు. సింగర్ జనై భోస్లే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

తర్వాతి కథనం
Show comments